– కాలువల పూడిక తీయిస్తున్న మంత్రి వాకిటి శ్రీహరి తమ్ముడు వాకిటి శేషగిరి
– ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న అమరచింత రైతులు
నారాయణపేట, సెప్టెంబర్ 24 (జన ఉదయం ప్రతినిధి)
మక్తల్ నియోజకవర్గ పరిధిలోని అమరచింత మండలంలోగల D-23 కెనాల్ పూడికతీత పనులు మంత్రివర్యులు డాక్టర్ వాకిటి శ్రీహరి ఆదేశానుసారంగా వారి తమ్ముడైనటువంటి వాకిలి శేషగిరి ఆధ్వర్యంలో గురువారం కాలువల పూడికతీత కార్యక్రమం ముందుకు సాగుతున్నాయి.
మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశాలను క్షేత్రస్థాయిలో అమలు చేస్తూ, ఆయన సోదరుడు మక్తల్ మాజీ ఉపసర్పంచ్ వాకిటి శేషగిరి స్వయంగా ముందుండి పూడికతీత పనులను పర్యవేక్షిస్తూ పూర్తి చేయిస్తున్నారు.
మాటల్లో కాదు… చేతల్లో చూపించే నాయకత్వం ఉన్న నాయకుడు మన మంత్రి వాకిటి శ్రీహరి,కాలువల్లో పూడిక తొలగించి… రైతుల పొలాలకు నీటి మార్గం సుగమం చేసే సేవ భావం కల వ్యక్తి మంత్రి సోదరుడు వాకిటి శేషగిరి. రైతుల కోసం శ్రీహరి అన్న సంకల్పం…
ఆ సంకల్పాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్న శేషగిరి అన్న అడుగు ముందుకు కొనసాగిస్తున్నారు.
చేలుకు నీరు పారాలి…పంటలు పండాలి…
రైతు ముఖంలో చిరునవ్వు నిలవాలి…
అన్నది మంత్రి శ్రీహరన్నా ముందున్న లక్ష్యం అని రైతులు భావిస్తున్నారు.
