TGPSC: తెలంగాణ గ్రూప్-2 ఫలితాలపై హైకోర్టు సంచలన తీర్పు

TGPSC

TGPSC: దాదాపు పదేళ్ల క్రితం నిర్వహించిన గ్రూప్-2 పరీక్ష ఫలితాలపై తెలంగాణ హైకోర్టు తాజాగా కీలక తీర్పునిచ్చింది. 2015-16లో విడుదలైన గెజిట్ నోటిఫికేషన్‌కు సంబంధించి విడుదలైన సెలక్షన్ లిస్ట్‌ను మంగళవారం హైకోర్టు రద్దు చేసింది. టీజీపీఎస్సీ (TGPSC) కోర్టు ఆదేశాలను పాటించకపోవడమే ఈ తీర్పుకు ప్రధాన కారణమని న్యాయస్థానం స్పష్టం చేసింది.

వైట్‌నర్ వినియోగం వివాదాస్పదమైంది

TGPSC: ఈ వివాదం ప్రధానంగా ఓఎంఆర్ (OMR) షీట్లలో వైట్‌నర్ వినియోగాన్ని కేంద్రంగా పెట్టుకుంది. పరీక్ష నిబంధనల మేరకు వైట్‌నర్‌ ఉపయోగించరాదు అని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. అయినప్పటికీ, కొంతమంది అభ్యర్థులు తమ వివరాలను నమోదుచేసేటప్పుడు వైట్‌నర్ వాడారు. దీనిపై 2016లో పరీక్ష నిర్వహణ అనంతరం టీజీపీ‌ఎస్సీ తన వెబ్‌సైట్‌లో ఒక నోట్ విడుదల చేసి, కేవలం కాండిడేట్ వివరాల్లో మాత్రమే వైట్‌నర్ వాడిన వారిని అంగీకరిస్తామని తెలిపింది.

TGPSC: హైకోర్టు స్పష్టమైన తీర్పు

తాజాగా కొందరు అభ్యర్థులు టీజీపీ‌ఎస్సీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. అయినా, నోటిఫికేషన్ నిబంధనలను మినహాయింపు ఇవ్వలేమని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఉల్లంఘించకూడదని హైకోర్టు తేల్చివేసింది. దీంతో మొత్తం సెలక్షన్ లిస్ట్‌ను రద్దు చేస్తూ, తదుపరి చర్యలకు మార్గం చూపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *