• తాగునీరు లేక ఒక వైపు తల్లడిల్లుతుంటే 20 రోజులుగా జాతీయ రహదారిపై నీటి ట్యాంకు కలిగిన పట్టించుకోరు
• పైసల పని ఉందంటే నీటి కనెక్షన్లు ఇచ్చే ప్లంబర్లు పరిగెత్తుకుని వెళుతుంటారు
• మనుషులు లేని చోట తాగునీరు, విద్యుత్తు నిరంతరం వదులుతూనే ఉంటారు
• మనుషులు ఉన్న దగ్గర అడుగుతుంటే పట్టించుకునే నాధుడే లేడు
నారాయణపేట, సెప్టెంబర్ 9 (జన ఉదయం ప్రతినిధి)
మక్తల్ మున్సిపాలిటీలోని అధికారులు, వర్కర్ల నిర్లక్ష్యం తీవ్రంగా కొట్టొచ్చినట్లు కనబడుతుందని పట్టణ ప్రజలు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. అది తాగునీటి వదులుటల్లో గాని, విద్యుత్తు ఏర్పాటు చేయుటలో కానీ, పరిశుభ్రతంలో కానీ ఎందులోనూ ఏమాత్రం పట్టించుకోని అధికారులు, వర్కర్ల యొక్క నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనబడుతుందని ప్రజలు తీవ్రంగా ఆరోపిస్తున్నారు.
167 వ జాతీయ రహదారి పక్కనే నారాయణపేటకు వెళ్లే దారిలో గల మక్తల్ పట్టణంలో తాగునీటి పైపులైను పగిలిపోయి 20 రోజులకు పైగా అవుతున్న అందరూ చూస్తున్నారు తప్ప వాటికి మరమ్మతులు చేయాలన్న ఆలోచన లేకపోవడం ఇది నిర్లక్ష్యం కాదా అంటూ ప్రజలు మండిపడుతున్నారు. ఆ ప్రాంతం గుండా వెళ్లే పాదచారకులు సైతం ఎంతో ఇబ్బంది పడుతూ వెళుతున్నారు. ఎక్కడో మారుమూల ప్రాంతంలో అంటే చూడలేము అని చెప్పవచ్చు కానీ ప్రధాన రోడ్డుపై రోజుల తరబడి నీరు ప్రవహిస్తూ ప్రజలు, వాహన చోదకులు ఇబ్బంది పడుతున్న ఒక్కరంటే ఒక్కరు మున్సిపల్ అధికారులు ఆ ప్రాంత కౌన్సిలర్లు కమిషనర్ చైర్మన్ ఎవరికి కనపడదా ఈ యొక్క ఇబ్బంది అంటూ ప్రజలు తీవ్రంగా ఆరోపిస్తున్నారు.
గతంలో అధికారుల పాలన ఉన్నప్పుడు కొంత మెరుగైనప్పటికీ. ప్రస్తుతం మున్సిపల్ పాలకవర్గం వచ్చినప్పటికీ పనితీరులు ఇంత నిర్లక్ష్యమా అంటూ ప్రజలు మండిపడుతున్నారు. ఎన్నికల్లో ఓట్లు అడగడానికి చెప్పులు అరిగేలా ఇళ్ళ ముందు వచ్చి ఓట్లను అడిగిన నాయకులు ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారు అంటూ ప్రజలు ఆరోపిస్తున్నారు. మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో కొంతమంది కొన్ని వార్డుల కౌన్సిలర్లు ప్రజల అవసరాలను తెలుసుకొంటూ వారికున్న ఆలోచన విధానంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగరాదన్న ముందస్తు ఆలోచనతో ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్న సంకల్పముతో అనేక అభివృద్ధి పనులు చేస్తున్నారు ఆ వీధి ప్రజలు సంతోషపడుతున్నారు. కానీ కొంతమంది కౌన్సిలర్లు వాళ్ళ ఇష్టారాజంగా ఓట్లు అడిగే టప్పటి చురుకుదనం కానివ్వండి మళ్లీ మళ్లీ వచ్చి ఇంటి ముందుకు వచ్చి తమకు ఓటేయండి మీ సమస్యల పరిష్కరిస్తాము అని చెప్పిన నాయకులు ఎందుకింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.
నాయకులు సరే అధికారుల పని తీరు ఏమైంది…
నాయకులు ఈరోజు ఉంటారు ఐదు సంవత్సరాల తర్వాత వెళ్లిపోవచ్చు మరి అధికారుల తీరు ఏమైంది అంటూ ప్రజల మండిపడుతున్నారు. ప్రజా అవసరాల నిమిత్తం ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడవలసిన బాధ్యత పాలకవర్గము అధికారులపై ఉందని జిల్లా కలెక్టర్లు నియోజకవర్గ ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి ఒకవైపు పదేపదే చెపుతున్నప్పటికీ ఈ అధికారులకు ఎందుకింత నిర్లక్ష్యం అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ముందు ప్రజా అవసరాలు ఎక్కడ ఉన్నాయి? ఎలాంటివి ఉన్నాయి అన్న ఒక ప్రణాళిక అయినా ఈ మున్సిపల్ అధికారులకు ఉందా అని అంటున్నారు. మక్తల్ మున్సిపాలిటీ అధికారులు ఏదైనా పనులు చెబుతుంటే ముఖ్యంగా వాటర్ మెన్లు, ప్లంబర్లు,తాగునీటిని వదిలేవారు ఏ ఒక్కరు అధికారుల మాట విన్నపాపన పోలేదంటూ ప్రజలు మండిపడుతున్నారు. అధికారులు చెప్పిన పెడచెవిన పెడుతున్న వీరు అదే ప్రైవేటు పనులు ఇస్తూ మా ఇంటికి నల్ల కలెక్షన్ ఇవ్వాలి మా పైపులైను లీకేజ్ అయిందంటే హడావుడిగా ప్రైవేటు వర్కర్లను పెట్టి ఆ గుంత తవ్వించి రాత్రి పగలు వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వెంటనే చేసి పెడుతున్న వీరు మున్సిపాలిటీ ఉద్యోగం లో పనిచేస్తూ ప్రజా అవసరాలను ఎందుకు తీర్చడం లేదంటూ ప్రజలు మండిపడుతున్నారు.
ముఖ్యంగా ఒక ప్రధాన రహదారిపై ఏదో ఒక వాహనం వెళ్లి పైపులైను పగిలిపోతే వాటికి మరమ్మతులు చేయవలసిన మునిసిపల్ సిబ్బంది ఆ వాహనము వెళ్లిన వారిని వెతకడానికి వెళతారా వారిని తీసుకొచ్చి ఆ పని చేయిస్తారా లేక వేరే మరమతులు చేయిస్తారా చెప్పవలసిన బాధ్యత వీరిపై ఉంది.
ఒకానొక సందర్భంలో మక్తల్ పట్టణంలోని ఒకటవ వార్డులో వినాయకులను లేపడానికి వచ్చినటువంటి క్రీన్ వాహనం వెళ్లిన సందర్భంలో ఒక పైపులైను పగిలిపోయింది. అట్టి పైపులైను ద్వారా రోడ్డుపై నీరు పారుతున్న ఏ ఒక్కరు పట్టించుకోలేదు. చివరికి ఎక్కడో పొట్టకూటికి వచ్చి బతుకుతున్నటువంటి ఆ వినాయకులు తయారు చేసే వారి యొక్క ముక్కు పిండి మెడలు వంచి వేలాది రూపాయలు వారితో పైపులు కొనిపించి తీసుకువచ్చి వేయడానికి నానా ఇబ్బందులు పెట్టినటువంటి ఒక వాటర్ మెన్ చివరికి తన నిర్లక్ష్య పని వల్ల మళ్ళీ అది యధావిధిగా లీకేజీ అవుతుంది ఇది మక్తల్ మున్సిపాలిటీ వర్కర్ల నిర్లక్ష్యం కాదా, యొక్క పనితీరు ఎలా ఉందో ఇక్కడే అర్థమవుతుందిఅంటూ ప్రజలు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఆ వీధిలో మురుగునీరు అదే విధంగా ప్రవహిస్తున్న పట్టించుకునే నాథుడే లేడు. కౌన్సిలర్ రాడు చైర్మన్ రారు కమిషనర్ రాడు వర్కర్లు అసలే రా రు. ఇదండీ మక్తల్ మున్సిపాలిటీ పాలకవర్గం పనితీరు.
ఏ మున్సిపాలిటీ వర్కర్ కు చెప్పిన ప్లంబర్కు చెప్పిన నీరు వదిలే వారికి చెప్పిన ఒకరి పైన ఒకరు ఆరోపణలు చేసుకోవడం తప్ప వారి పని విధానం మాత్రము తీవ్ర నిర్లక్ష్యంతో ఉన్నట్టు కనబడుతుందని ప్రజలు అంటున్నారు.
ఏది ఏమైనప్పటికీ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడవలసిన బాధ్యత మున్సిపల్ పాలకవర్గానిది అధికారుల ది సంబంధిత వర్కర్ల పైన ఉంది అంటూ ప్రజలు గుర్తు చేస్తున్నారు. ఇప్పటికైనా స్పందిస్తూ మక్తల్ పట్టణంలో ఎక్కడ ఏ వీధిలోన ప్రజలకు ఇబ్బందులు జరుగుతున్న వెంటనే స్పందిస్తూ ముందుగా ఆ వార్డు కౌన్సిలర్ మున్సిపల్ కమిషనర్ వర్కర్లు అందరూ ప్రజల ఇబ్బందులు తీర్చవలసిందిగా ప్రజలు కోరుతున్నారు. లేదంటే ఇదే నిర్లక్ష్యమైన పాలన మక్తల్ మున్సిపాలిటీలో కొనసాగక తప్పదంటూ ప్రజలు భావించక తప్పదు.
