• దళిత యువతికి న్యాయం చేయాలని ప్రజా సంఘాల ఐక్యవేదిక డిమాండ్ • చిట్యాల లో శాంతియుత నిరసనకు ప్రజా సంఘాల పిలుపు • వివాహ వ్యవహారంపై న్యాయం కోరుతూ ‘చలో చిట్యాల’ • […]
Month: September 2026
ఈనెల 17న మక్తల్ లో ఘనంగా విశ్వకర్మ జయంతి మహోత్సవాలు – ఆలయంలో ప్రత్యేక పూజలు, శోభాయాత్ర – ఆధ్యాత్మిక కార్యక్రమాల ఏర్పాట్లు – విశ్వకర్మ సంఘం అధ్యక్షులు శ్రీనివాసులు నారాయణపేట, సెప్టెంబర్ 16 (జన ఉదయం ప్రతినిధి) విశ్వకర్మ భగవానుని జయంతిని పురస్కరించుకుని ఈనెల 17వ తేదీన మక్తల్ పట్టణం, పరిసర గ్రామాల ప్రజల సంయుక్త ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి మహోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు విశ్వకర్మ సంఘం అధ్యక్షులు శ్రీనివాసులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు . విశ్వకర్మ సమాజానికి చెందిన కమ్మర, వడ్రంగ, కంచర, శిల్పి, స్వర్ణకార తదితర వృత్తులకు విశ్వకర్మ భగవానుడు ఆరాధ్యదైవంగా భావించబడుతున్న నేపథ్యంలో ఈ ఉత్సవాలకు ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఏర్పడిందని తెలిపారు . ఈనెల 17న మక్తల్ పట్టణంలోని మునేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో ప్రధాన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు అధ్యక్షులు శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా విశ్వకర్మ భగవానునికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు భక్తులకు స్వామివారి దర్శనం, ప్రసాద వితరణ వంటి కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. శోభయాత్ర కార్యక్రమం…. పట్టణంలోని శ్రీ నల్లజానమ్మ దేవాలయం నుంచి మేళతాళాలతో పురవీధుల గుండా అంగరంగ వైభవంగా శోభాయాత్ర నిర్వహించనున్నట్లు అధ్యక్షులు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగనున్నట్లు వెల్లడించారు. విశ్వకర్మ భగవానుడు సృష్టి నిర్మాణానికి ప్రతీకగా, కళాకారులు, శిల్పులు, వృత్తి నిపుణులకు ఆదర్శదైవంగా కొలవబడుతున్నారని పేర్కొన్నారు. భక్తి, ఆధ్యాత్మికతతో పాటు విశ్వకర్మ సమాజ ఐక్యతను చాటేలా ఈ మహోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విశ్వకర్మ జయంతి మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా విశ్వకర్మ భగవానుని భక్తులు, విశ్వబ్రాహ్మణులు, హిందూ బంధువులు, పట్టణ ప్రజలు, పరిసర గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని అధ్యక్షులు శ్రీనివాసులు పిలుపునిచ్చారు .
– ఆలయంలో ప్రత్యేక పూజలు, శోభాయాత్ర – ఆధ్యాత్మిక కార్యక్రమాల ఏర్పాట్లు – విశ్వకర్మ సంఘం అధ్యక్షులు శ్రీనివాసులు నారాయణపేట, సెప్టెంబర్ 16 (జన ఉదయం ప్రతినిధి) విశ్వకర్మ భగవానుని జయంతిని పురస్కరించుకుని ఈనెల […]
మక్తల్ లో కొనసాగుతున్న స్వామి వివేకానంద విగ్రహ ఆవిష్కరణ వారోత్సవాలు
– వివేకానంద వ్యవస్థాపక కమిటీ,ఏబీవీపీ ఆధ్వర్యంలో మహనీయుల విగ్రహాలకు జలాభిషేకం,పూజా కార్యక్రమం… నారాయణపేట, సెప్టెంబర్ 15 (జన ఉదయం ప్రతినిధి) మఖ్తల్ పట్టణం స్వామి వివేకానంద చౌరస్తాలోని స్వామి వివేకానంద విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా […]
JICE ED అకావో తకాశి, తెలంగాణ పాఠశాలల డైరెక్టర్Dr. E నవీన్ నికోలెస్ చే ప్రశంసా పత్రాన్ని అందుకున్నా కర్ని ఫిజికల్ డైరెక్టర్ B.రూప
– జపాన్ రాజధాని టోక్యో పర్యటన ముగించుకుని ఇండియాకు రాక – వివిధ రకాల పాఠశాలలు , టీచర్స్ ట్రైనింగ్ సెంటర్, ప్రత్యేక అవసరాలు గల పిల్లలు పాఠశాల ల ను సందర్శించిన రూప […]
కాలుష్య రహిత వినాయక చవితికి గోలపల్లి గ్రామం ఆదర్శం…
• 11 ఏళ్లుగా మట్టి వినాయకుడినే ప్రతిష్ఠిస్తున్న గ్రామస్తులు • గోలపల్లి గ్రామస్తులను అభినందించిన పలు హిందూ ధార్మిక సంస్థలు నారాయణపేట, సెప్టెంబర్ 14 (జన ఉదయం ప్రతినిధి ) పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ […]
లైసెన్స్ క్లబ్ ఆఫ్ మక్తల్ భీమా ఆధ్వర్యంలో మట్టి వినాయకల పంపిణీ
– అధ్యక్షులు లైన్ టి.నాగరాజు నారాయణపేట, సెప్టెంబర్ 14 (జన ఉదయం ప్రతినిధి) లయన్స్ క్లబ్ ఆఫ్ మక్తల్ బీమా సభ్యుల సహకారంతో సోమవారం అధ్యక్షుడు లయన్ టి నాగరాజు అధ్యక్షతన శ్రీ పడమటి […]
మంత్రి వాకిటి శ్రీహరి పరామర్శ…
– అనారోగ్యంతో చికిత్స పొందుతున్న లక్ష్మీ గాయత్రిని పరామర్శించిన మంత్రి నారాయణపేట, సెప్టెంబర్ 14 (జన ఉదయం ప్రతినిధి) మక్తల్ పట్టణానికి చెందిన గాయత్రి అనిల్ కుమార్ తల్లి లక్ష్మీ గాయత్రి కొంతకాలంగా అనారోగ్యంతో […]
మక్తల్ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమలు పంపిణి
– వాసవి క్లబ్ అధ్యక్షులు హరికృష్ణ నారాయణపేట, సెప్టెంబర్ 14 (జన ఉదయం ప్రతినిధి) నారాయణ పేట జిల్లా మక్తల్ పట్టణం లో మక్తల్ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్బంగా సోమవారం […]
బీజేపీకి షాక్.. కాంగ్రెస్లోకి చేరికలు.!
– లంకాల బిజెపి పార్టీ ఒకటవ వార్డు మెంబర్ కురువ శారదా మల్లేష్ కాంగ్రెస్ లో చేరిక – కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుతూ స్వాగతించిన మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి నారాయణపేట, సెప్టెంబర్ […]
JICE ED అకావో తకాశి, తెలంగాణ పాఠశాలల డైరెక్టర్Dr. E నవీన్ నికోలెస్ చే ప్రశంసా పత్రాన్ని అందుకున్నా కర్ని ఫిజికల్ డైరెక్టర్ B.రూప
– జపాన్ రాజధాని టోక్యో పర్యటన ముగించుకుని ఇండియాకు రాక – వివిధ రకాల పాఠశాలలు , టీచర్స్ ట్రైనింగ్ సెంటర్, ప్రత్యేక అవసరాలు గల పిల్లలు పాఠశాల ల ను సందర్శించిన రూప […]
