: జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఐపీఎస్
…నేటి నుండి నిమజ్జనం వరకు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలి
నారాయణపేట,సెప్టెంబర్ 8( జన ఉదయం ప్రతినిధి )
వినాయక చవితి ఉత్సవాలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా పోలీసు అధికారులతో ఎస్పీ డాక్టర్ వినీత్ IPS ప్రత్యేక సమావేశం నిర్వహించి ఉత్సవాలు సజావుగా జరిగేందుకు భద్రత పరమైన సూచనలు చేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ IPS మాట్లాడుతూ… గణేష్ ఉత్సవాలు 14.09.2026 నుండి 25.09.2026 వరకు కొనసాగుతున్న నేపథ్యంలో జిల్లా ప్రజల భద్రత, రక్షణ ముందు నుంచే పోలీస్ అధికారులు పటిష్టమైన ప్రణాళికతో చర్యలు చేపట్టాలని ఎస్పీ సూచించారు. ముందుగా మత పెద్దలు, ప్రజాప్రతినిధులు, గణేష్ మండపాల నిర్వాహకులతో శాంతి సమావేశాలు నిర్వహించాలి. సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసి ఉత్సవాల నిర్వహణకు అవసరమైన చర్యలు తీసుకోవాలి. గణేష్ మండపాల నిర్వాహకులు విగ్రహాల ఏర్పాటు వివరాలను తప్పనిసరిగా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి. ప్రజలకు, వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలిగే విధంగా ప్రధాన రహదారులు, రోడ్లపై మండపాల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వకూడదు. నిబంధనలకు విరుద్ధంగా డీజేలకు అనుమతి ఇవ్వకూడదు. రౌడీషీటర్లు, కమ్యూనల్ షీటర్ల ను మండలాల వారిగా బండోవర్ చేయాలని మరియు ఇతర సమస్యాత్మక వ్యక్తులపై నిరంతరం నిఘా ఉంచాలి. గణేష్ మండపాల వద్ద నిర్వాహకులు తగిన భద్రతా చర్యలు చేపట్టేలా అవగాహన కల్పించాలి. గణేష్ విగ్రహాలకు జియో ట్యాగింగ్ చేయాలి. నిమజ్జనం జరిగే రూట్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. విలేజ్ పోలీస్ ఆఫీసర్స్ ప్రతి రోజు గ్రామాలలో పర్యటించి ఆర్గనైజర్స్ తో మాట్లాడుతూ వారితో వాట్స్ అప్ గ్రూప్ ఏర్పాటు చేసి వారికి సూచనలు చేయాలి. వీధుల పట్ల ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే శాఖ పరిరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలతో మర్యాదగా ఉండాలని ఎవరి పైన అనుచితంగా ప్రవర్తించరాదు అని తెలిపారు. జిల్లా పరిధిలో సోషల్ మీడియా పై పూర్తి స్థాయిలో నిఘా ఏర్పాటు చేయాలి అని సూచించారు.
జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుతంగా ఉత్సవాలు జరిగే విధంగా తగిన చర్యలు తీసుకొని శాంతి భద్రతలు పరిరక్షించాలి అలాగే ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ అల్లర్లు సృష్టించాలని చూస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ తెలిపారు.
ఈ సమావేశంలో అదనపు ఎస్పీ MD రియాజ్ హుల్ హక్, డీఎస్పీ లు మహేష్, నల్లపు లింగయ్య, CI శివ శంకర్, రామ్ లాల్, భగవంత్ రెడ్డి, సైదులు, RI విజయ్ భాస్కర్, ఎస్ఐ లు వెంకటేశ్వర్లు, సతీష్ రెడ్డి, పురుషోత్తం, భాగ్యలక్ష్మి రెడ్డి, విజయ్ భాస్కర్, రాజు, అశోక్ బాబు, చంద్ర శేఖర్, SM నవీద్, గాయత్రి, మహేశ్వరి, కృష్ణ చైతన్య, శ్వేత, శిరీష, బాలరాజు తది తరులు పాల్గొన్నారు.
