స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఘన నివాళి అర్పించిన మంత్రి వాకిటి శ్రీహరి, ఇతర మంత్రులు

హైదరాబాద్, సెప్టెంబర్ 2 (జన ఉదయం ప్రతినిధి)

స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం
పంజాగుట్టలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి నివాళులు అర్పించిన మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్, , అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లు
వైఎస్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఆయనకు ఘన నివాళులు అర్పించారు.

పేదలు, రైతులు, బడుగు బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి పనిచేశారని వారు పేర్కొన్నారు. ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకుని, వారి జీవితాల్లో మార్పు తీసుకురావాలనే సంకల్పంతో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసిన ప్రజానాయకుడిగా ఆయన చిరస్మరణీయంగా నిలిచిపోయారని అన్నారు.
రైతులకు ఉచిత విద్యుత్‌, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, 108 వంటి అనేక ప్రజోపయోజిత కార్యక్రమాల ద్వారా వైఎస్సార్‌ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశారని మంత్రులు గుర్తు చేశారు.

ప్రజా సంక్షేమమే పరమావధిగా భావించిన వైఎస్సార్‌ ఆశయాలను కొనసాగిస్తూ ప్రజల కోసం పనిచేయడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని మంత్రులు అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *