మక్తల్ లో ఘనంగా మహానాయకుడు వైయస్సార్ వర్ధంతి వేడుకలు

మక్తల్ లో ఘనంగా మహానాయకుడు వైయస్సార్ వర్ధంతి వేడుకలు

– వైయస్సార్ చిత్రపటానికి పూల మాలలు వేస్తూ కాంగ్రెస్ శ్రేణుల ఘన నివాళి

నారాయణపేట, సెప్టెంబర్ 2( జన ఉదయం ప్రతినిధి)

మాజీ ముఖ్యమంత్రి, మహానాయకుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం మక్తల్ కాంగ్రెస్ టౌన్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

జలయజ్ఞం, రైతు సంక్షేమంపై నేతల ప్రశంసలు..

కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ… వైయస్సార్ నాయకత్వంలోనే రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులు రూపుదిద్దుకున్నాయని, జలయజ్ఞం ద్వారా రైతుల భూముల్లో సాగునీరు అందించారని కొనియాడారు. రైతు సంక్షేమం కోసం వైయస్ రాజశేఖర్ రెడ్డి అనేక చర్యలు చేపట్టారని, ఆయన హయాంలో సంక్షేమం స్వర్ణయుగంలా కొనసాగిందని నాయకులు అభివర్ణించారు.

కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు…

మార్కెట్ చైర్‌పర్సన్ రాధా లక్ష్మారెడ్డి
మున్సిపల్ చైర్‌పర్సన్ వాకిటి మానస హనుమంతు మార్కెట్ వైస్ చైర్‌మన్ గణేష్ కుమార్ టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అల్పురి రవికుమార్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ మార్కెట్ డైరెక్టర్లు, సర్పంచులు, మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *