డాక్టర్ మణికంఠ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు…

• గోపూజ, దేవాలయ పూజలు

• రక్తదానం, అన్నదానంతో అర్థవంత సంబరాలు

మక్తల్/నారాయణపేట, సెప్టెంబర్ 2( జన ఉదయం ప్రతినిధి)

జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ 55వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలో ఘనమైన వేడుకలు, సేవా కార్యక్రమాలు జరిగాయి.
మక్తల్ నియోజకవర్గ జనసేన ఇన్‌చార్జ్, డాక్టర్ మణికంఠ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా జరుపుకున్నారు.
కార్యక్రమాలను మక్తల్ మండలం పస్పుల గ్రామంలోని అనాకులం గోకులం గోశాలలో గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. గోశాలలోని గోవులకు పళ్లు తినిపించి, గోసంరక్షణ ప్రాముఖ్యతను గుర్తుచేసుకున్నారు.
అనంతరం మక్తల్ పట్టణంలోని శ్రీ శ్రీ పడమటి ఆంజనేయ స్వామి దేవాలయంలో పవన్ కళ్యాణ్ దీర్ఘాయుష్యం, ఆరోగ్యం కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం స్థానిక అంబేద్కర్ కూడలి వద్ద ఏర్పాటు చేసిన వేదికపై పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి, పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో స్థానికులు, బాటసారులు, వృద్ధులకు ఉచితంగా భోజనం వితరణ చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన పార్టీ నాయకులు..

పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యల పరిష్కారం, సంక్షేమ కార్యక్రమాల్లో చూపిస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు. రైతులు, యువత, మహిళలు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయమని అన్నారు. పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలను ప్రజల్లోకి విస్తరించేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.
అనంతరం నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఎస్ ఆర్ గార్డెన్స్‌లో జనసేన పార్టీ నాయకులు కోస్గి విష్ణువర్ధన్ రెడ్డి, గుడిసె నరసింహ బాలు, అంబికా మరియు మెగా అభిమానుల ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. ఈ శిబిరంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో రక్తదానం చేశారు.

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా నాయకులు అరుణ్ కుమార్ గౌడ్, డీకే అశోక్ కుమార్, కృష్ణ, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. రక్తదాన శిబిరం అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో స్థానికులు, వృద్ధులు, నిరుపేదలకు ఉచితంగా భోజనం వితరణ చేశారు.
ఈ వేడుకల్లో మక్తల్ నియోజకవర్గ జనసైనికులు కె. రామన్ గౌడ్, గౌడి బాల్ రెడ్డి, బాదేపల్లి నరేష్ గౌడ్, ఉమేష్, భీమేష్, కావలి ప్రవీణ్, కృష్ణ గౌడ్, కమ్మరి శ్రీను, రవి కుమార్, చిట్యాల్ నరసింహ, శ్రీను, వెంకటేష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమ విజయానికి కృషి చేసిన అందరినీ డాక్టర్ మణికంఠ గౌడ్ అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *