కర్ణాటక యాదగిరి సిద్ధిలింగేశ్వర్ డిగ్రీ కళాశాలలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

– ముఖ్యఅతిథిగా పాల్గొన్న మక్తల్, నియోజకవర్గజనసేనపార్టీ ఇంచార్జ్ డాక్టర్ మణికంఠ గౌడ్

– విద్యార్థుల మధ్య కేక్ కట్ చేస్తూ సంబరాలు జరుపుకున్న యాజమాన్యం

నారాయణపేట, సెప్టెంబర్ 2 (జన ఉదయం ప్రతినిధి)

కర్ణాటక రాష్ట్రం యాదగిర్ జిల్లా సిద్ధిలింగేశ్వర్ డిగ్రీ కళాశాలలో బుధవారం కర్ణాటక రాష్ట్ర నాయకులు మైలారప్ప జాగీర్దార్ ఆధ్వర్యం లో జరిగిన ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని జెన్ జి విద్యార్థుల తో జరుపుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర మక్తల్ నియోజకవర్గం జనసేనపార్టీ ఇంచార్జ్ డాక్టర్ మణికంఠ గౌడ్ ముఖ్య అతిథి గా పాల్గొని పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని జరపడం జరిగింది.
ఈ కార్యక్రమం లో డాక్టర్ మణికంఠ గౌడ్ మరియు జాగీర్దార్ మాట్లాడుతూ విద్యార్థులు మమ్మలని జన్మదినానికి ఆహ్వానించినందుకు సిద్ధిలింగేశ్వర్ డిగ్రీ కళాశాల విద్యార్థులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అన్నారు. ఈ రోజు దేశం లో ఎన్నో అరాచక శక్తులు స్వార్థ రాజకీయాల స్వలాభం కోసం దేశ యువకులను తప్పు దారిలో కి మళ్లిస్తున్నాయని తెలిపారు.
కావున మీ లాంటి విద్యార్థులు జెన్ జి లు భవిష్యత్తు తరానికి స్ఫూర్తి దాయకం కావాలి దేశ సమగ్రత దెబ్బతినకుండా ఉండాలని మన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ ఎపుడు చెబుతుంటాడు కావున మీ లాంటి యువత సరైన మార్గం లో వెళ్ళాలని చెడు అలవాట్లకు దూరంగా ఉండి మంచిగా చదువుకొని దేశానికి రక్షణగా ఉండాలని ప్రతి యువకుడు ఒక శాస్త్రవేత్త సైనికుడు రాజకీయనాయకుడు గా ఇలా ప్రతి రంగాల్లో ఉండాలని వారు అన్నారు.ఈ కార్యక్రమం లో స్థానిక యాద్గిర్ జిల్లా జన సైనికులు అశోక్ మల్లు వినోద్ మల్లిఖార్జున్ మరియు మక్తల్ నియోజకవర్గ నాయకులు రామన్ గౌడ్ బాదేపల్లి నరేష్ గౌడ్ పీకే ప్రవీణ్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *