సొంత ఖర్చులతో సైక్లింగ్ పోటీలకు మట్టి రోడ్డును శుభ్రపరచుకున్న బి గోపాలం

– క్రీడలు ఒక్కటే కాదు డబ్బుతో కూడుకున్న శ్రమదానం చేసి క్రీడలకు ప్రాణం పోస్తున్న గోపాల

– మున్సిపాలిటీ కామాటీల నిర్లక్షం రోడ్ల పైన, స్మశానంలో చెత్త వేయడం ఎంతవరకు సమంజసం

– తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బి.గోపాలం

నారాయణపేట, సెప్టెంబర్ 2 (జన ఉదయం ప్రతినిధి)

తెలంగాణ రాష్ట్ర సైకిలింగ్ అసోసియేషన్ వారి ఆదేశాల మేరకు, నారాయణపేట జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బి.గోపాలం ఆధ్వర్యంలో, ఈనెల 3 న గురువారం బాలబాలికలకు జిల్లా స్థాయి మౌంటెన్ సైక్లింగ్ పోటీలు నిర్వహించుటకు, మక్తల్ కొత్త గార్లపల్లి రైల్వే బ్రిడ్జి నుండి కుడి పక్కన కాల్వ ప్రక్కన గల మట్టి రోడ్డులో నారాయణపేట వెళ్లే రోడ్డు బ్రిడ్జి వరకు రోడ్డుపై గల చెత్తాచెదారని బుధవారం కూలి మనసులను పెట్టి తొలగించి రోడ్డును శుభ్రం చేయించారు. ఈ నెల 3 న గురువారం మక్తల్ లో జరుగు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా స్థాయి బాలబాలికల 5 కి.మీ. మౌంటెన్ సైక్లింగ్ పోటీలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుటకు మట్టి రోడ్డును సిద్ధం చేసినట్లు బి.గోపాలం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మక్తల్ మున్సిపాలిటీ సిబ్బంది పట్టణంలోని రోడ్లను ఊడ్చిన ఆ చెత్తాచెదారాన్ని ఊరి బయట గల కాల్వ ప్రక్కన గల మట్టి రోడ్డుపై వేయడము , స్మశానంలో వేయడము సమంజసం కాదు. మున్సిపల్ కమిషనర్ ఈ విషయంలో శ్రద్ధ తీసుకొని ఊరికి దూరంలో మనుషులు నడవని ప్రాంతంలో వేయించాలని బి. గోపాలం విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *